new lift irrigation scheme to lift Krishna water from Srisailam Project

Chief Minister Sri K Chandrashekar Rao said that the unilateral decision of Andhra Pradesh government to construct a new lift irrigation scheme to lift Krishna water from Srisailam Project is highly objectionable. He said the decision taken by the AP government is against the AP State Reorganization Act. The CM declared that a legal fight would be initiated against the project to stop it, as it would be severely against the interests of the Telangana State. The CM instructed the officials concerned to file a complaint against the AP Government decision in the Krishna Water Management Board on behalf of the Telangana State government. Sri KCR pointed out that taking a unilateral decision on the inter-state Srisailam project water issue, planning construction of a new project without the consent from the Apex Committee as the mistakes committed by the AP Government. He made it clear the project would be stopped by the Telangana government and it would put in a fight without any compromise.

The AP government, which decided to construct a new Lift Irrigation project to lift 3 TMC of water from the Srisailam project, had already issued a GO in this regard. The CM held a high-level review meeting on this at Pragathi Bhavan here on Monday. Ministers Sri Etela Rajender, Sri Mohammed Ali, Sri Srinivas Goud, Sri Niranjan Reddy, Sri Jagdeesh Reddy, Sri Puvvada Ajay, Rythu Bandhu Samithi State President Sri Palla Rajeshwar Reddy, Government’s Chief Advisor Sri Rajiv Sharma, Irrigation Advisor Sri SK Joshi, Chief Secretary Sri Somesh Kumar, Irrigation Principal Secretary Sri Rajath Kumar, E-in-C Sri Muralidhar, AG Sri BS Prasad, Additional AG Sri Ramchander Rao, Legal Consultant Sri Ravindra Rao, retired engineers Sri Shyam Prasad Reddy, Sri Chandramouli, CMO Secretary Ms Smita Sabharwal, OSD Sri Sridhar Deshpande, Irrigation senior engineers participated. They have discussed at length about the proposed project by the AP government. Speaking on the occasion, the CM said since the proposed project by the AP was against the interests of the Telangana state, a legal battle would be initiated to raise the objection and thwart the project.

“The AP State Reorganization Act had clearly stipulated that if new irrigation projects are planned in AP or Telangana state they should get clearance from the Apex Committee. But the AP government did not get any approval from the Apex Committee. Srisailam project is AP and Telangana state’s combined project. Water from these projects should be utilised by both the States. But the AP government without even consulting the Telangana state has decided to lift water from Srisailam project and issued a GO in this regard. This is highly objectionable. If Krishna water is diverted by the AP government, then united Palamuru, Nalgonda, Rangareddy districts will face water crisis for both drinking and agriculture purposes. Hence, we file a complaint with the KRMB to issued directives to stop the project from construction,” the CM clarified.

“The Telangana State government had extended a friendly hand to the AP stating that river waters should be utilised for the benefit of farmers in both the states setting aside all the differences, disputes of the past. I have taken the initiative by saying there should not be any ego or water basin problems in utilizing the water. It is very painful that despite this, the AP government declared a new scheme without even consulting with the Telangana state to lift water from Srisailam project unilaterally. This dented the very spirit with which water should be utilised by the two stats with mutual cooperation. There is no compromise when it comes to protecting the interests of the State. We will put up a relentless legal fight to stop this project under any circumstances,” the CM declared.

The CM also instructed the official to approach the Supreme Court on the matter as there was delay happening in the Brajesh Kumar Tribunal. Constructions of projects are going on in the State to utilise 950 TMC of the State share of the Godavari water. Telangana state needs more water. Water is needed for drinking water needs, industrial needs and for the power plants. Hence the CM instructed the officials to request the Centre to allocate 600 TMC of water from the Godavari River Surplus water. He also instructed the officials to complete forthwith Palamuru-Rangareddy Lift Irrigation scheme to lift 2 TMC of water daily.

*****

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. ఎపి ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు శ్రీ ఈటల రాజెందర్, శ్రీ మహమూద్ అలీ, శ్రీ శ్రీనివాస గౌడ్, శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, నీటి పారుదల సలహాదారు శ్రీ ఎస్.కె. జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రజత్ కుమార్, ఇఎన్సి శ్రీ మురళీధర్, ఎజి శ్రీ బి.ఎస్. ప్రసాద్, అడిషనల్ ఎజి శ్రీ రాంచందర్ రావు, లీగల్ కన్సల్టెంట్ శ్రీ రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి, శ్రీ చంద్రమౌళి, సిఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, ఓఎస్డి శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే, నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్ట తలచిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కాబట్టి, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.

‘‘తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

‘‘గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఎపికి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఎపి తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టిఎంసిల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉంది. మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాలి. కాబట్టి గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టిఎంసిలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రోజుకు రెండు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *